

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నేడు అనగా 19/02/2025 రోజు తూంపల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అభిషేక్ మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది మరియు లింగ నిర్ధారిత వీర్యము గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా 500 రూపాయలు రైతు అకౌంట్ కు వాపస్ ఇవ్వబడును. ఈ శిబిరంలో దాదాపు 42 గేదెలు 18ఆవులకు చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఒ డి ఎల్ డి ఏ. క్టర్.అబ్దుల్ మాజీద్ నిజామాబాద్, డి ఎల్ డి ఏ సూపర్వైజర్ కృష్ణ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్మరియు బాలకిషన్, దేవయ్య సిబ్బంది శ్రీనివాస్ చెంద్రశేఖర్ , సతీష్ గోపాల మిత్రులు రంజిత్ , వెంకన్న మరియు రైతులు పాల్గొన్నారు.