

జనం న్యూస్ ఫిబ్రవరి 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ధైర్యసాహాసాలకు మారు రూపం.ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు.హిందు ధర్మం కాపాడిన దురంధరుడు,పరాయిలకు సింహాస్వప్నం అయిన చత్రపతి శివాజీ మహారాజ్ 395’వ పుట్టినరోజు సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ రోడ్ నెంబర్ తొమ్మిది లో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, హిందూ బంధువులు శివాజీ సేన వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ జన్మదిన వేడుకల్లో వారి ఆహ్వానం మేరకు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం మొఘలులను, ఎంతో మంది కరుడుగట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టికరిపించిన యోధుడు.దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించాలని సందేశాన్నిచ్చిన దేశభక్తుడు. అలాంటి గొప్ప యోధుడి అడుగు జాడల్లో మనం అంతా నడవాలని శివాజీ జయంతి వేళ ఆయనలో ఉన్న విధంగా ధైర్యసాహాసాలు, మంచి తనం, అన్యాయంను ఎదుర్కొనే సాహాసం, ధర్మస్థాపనకు, అధర్మంను కూకటి వేళ్లతో పేకిలి వేసేందుకు అవసరమైతే ఎంతకైన పోరాడాలని ఆయన జీవితంలోని సంఘటనల ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకై మనమందరం కృషి చేద్దామని తెలియజేస్తూ, వారి ఆశీర్వాదాలు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ.. అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం స్థానిక నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు,అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా కార్యదర్శి పులిగోల్ల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ , డివిజన్ నాయకులు అంకిత్, స్థానిక డివిజన్ లోని బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.