డబల్ బెడ్ రూమ్ కాలనీ వద్దఘనంగా ‘వన మహోత్సవం’
మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్అక్కి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ గణేష్.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఆగస్టు 25-08-2026 పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని డబల్ బెడ్ రూమ్ కాలనీ సమీపంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ గణేష్, వైస్ చైర్మన్ సుమిత్ర, స్థానిక కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని కాలనీ పరిసరాల్లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.మున్సిపల్ కమిషనర్ గణేష్ మాట్లాడుతూ.కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి పెరిగి పెద్దయ్యే వరకు సంరక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కాలనీవాసులు నాటిన మొక్కల సంరక్షణలో భాగస్వాములై పరిసరాలను పచ్చదనంతో నింపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు మంగరాయి మన్యం,పర్వీన్ షకీల్, జమ్ములమ్మ, శివసాయి, తాటికొండ కృష్ణ, భాగ్యలక్ష్మి శివ, పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి,మాజీ వార్డ్ మెంబర్ సుధాకర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.