ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా

August 25, 2026 | ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల సంక్షేమానికి తెదేపా ప్రాధాన్యం :మంత్రి వాసంశెట్టి సుభాష్


జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి సుభాష్ అందజేశారు. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వినకోటి స్టాలిన్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా కింద మంజూరైన 5 లక్షల చెక్కును స్టాలిన్ భార్య అనూషకు మంగళవారం మంత్రి సుభాష్ తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు పార్టీ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కార్యకర్త కష్టాల్లో ఉంటే పార్టీ కుటుంబంలా అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. కోటి మందికి పైగా సభ్యులతో బలమైన కుటుంబంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలకు కష్టకాలంలో భరోసాగా నిలుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాద బీమా కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. ప్రమాద బీమా ద్వారా స్టాలిన్ కుటుంబానికి కొంతమేర ఆర్థిక భరోసా లభిస్తుందని మంత్రి సుభాష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వయిట్ల గజలక్ష్మి, పలివెల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper