

పౌష్టికాహారం మంచిగా తీసుకుంటూ శుభ్రతను పాటించాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 20: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిక్షయ్ శివిర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 60 మంది నుండి తిమ్మడ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించడం జరిగింది. వచ్చిన రోగులకు బిపి మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రవీందర్, డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి జ్వరము దగ్గు మరియు ఆకలి లేకపోవడం వంటి కారణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది మరియు వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మాట్లాడుతూ. అందరూ పౌష్టికాహారం మంచిగా తీసుకుంటూ శుభ్రతను పాటిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచి జీవనశలింగం ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీవీ సూపర్వైజర్లు ఎస్టిఎల్ఎస్ పిడమర్తి సైదులు,ఎస్ టి ఎస్ సుభాషిని , ల్యాబ్ టెక్నీషియన్ సతీష్,ఏఎన్ఎంలు భానుమతి,మమత, సరిత గ్రామ కార్యదర్శి శ్వేత,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రవి, ఆశ కార్యకర్తలు లింగమ్మ, కే రమణమ్మ, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.