

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపిచేడి మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి “చిన్నమైల్ అంజిరెడ్డి మరియు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని పట్టభద్రుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ గారు మాట్లాడుతూ అంజిరెడ్డి మరియు కొమురయ్య గారు ఎమ్మెల్సీగా గెలిస్తే విద్య, ఉపాధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూతు ఇంచార్జ్ అశోక్ మండల జనరల్ సెక్రెటరీ వెంకటేశం దశరథ్ యాదగిరి జోగయ్య యాదయ్య మల్కయ్య యాదగిరి రవి తదితరులు పాల్గొన్నారు