

జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని పురుషోత్తపట్నం చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బైరా వెంకటకృష్ణ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైరా వెంకటకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు. దుష్యాలువాతో ఘనంగా సత్కరించి, తెలుగు జర్నలిష్ట సంక్షేమ సంఘం డైరీ అందజేయడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.