

పిబ్రవరి 20: జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో సి పి యం పార్టీ బిఎస్ రామయ్య భవనంలో కామ్రేడ్ బడే సీతారామయ్య 37 వ వర్ధంతి కార్యక్రమం మచ్చ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కామ్రేడ్ చింతూరు వెంకటరావుగారు మాట్లాడుతూ ఆయనతో కలిసి పని చేసే అదృష్టం నాకు కలిగిందని ఎంతో గొప్ప వ్యక్తి బడే సీతారామయ్య అని భద్రాచల ఉద్యమ నిర్మాతల్లోబడే సీతా రామయ్య ఒకరు అని అన్నారు బడే సీతా రామయ్య సిపిఎం పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు సిపిఎం పార్టీ ఉదృతంగా ఉంది అంటే అలుపెరుగని కృషిచేసిగ్రామ గ్రామాన సిపిఎం పార్టీ ఎర్రజెండా ఔనిత్యాన్ని తెలియపరిచి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరుపేదల ఆకలి కోసం ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ చర్ల ప్రాంతంలో సి పి యం పార్టీ బీజాన్ని నాటి ఒక మహోన్నతమైనవ్యక్తి మన బడే సీతారామయ్య అని కొనియాడారు ప్రజలలో చైతన్యాన్ని రగిలించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది సిపిఎం పార్టీ ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ మండలకార్యదర్శి మచ్చ రామారావు సిపిఎం మండల కమిటీ సభ్యులు బందెల చంటి బి. నవీన్ పొడుపుగంటి సమ్మక్క పామర్ బాలాజీ దొడ్డిహరినాధ వర్మ తాటి నాగమణి ఊడుగుల షారోను వరదల వరలక్ష్మి పార్టీ సభ్యులు విసంపల్లి రమేష్ కాంతయ్య మల్లారం తదితరులు పాల్గొన్నారు