

జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మడిమాంబ జాతర మహోత్సవం సందర్భంగా విజయరామరాజుపేట అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కే కే వి ఏ నారాయణరావు భోగి లింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ అనకాపల్లి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించిన అనంతరం కమిటీ సభ్యులు ఆళ్ల సూర్య రామకృష్ణ డాక్టర్ నారాయణరావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొయిలాడ గణేష్ పిల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.