Listen to this article

జనం న్యూస్ జనవరి 11 నారాయణపేట జిల్లా. దామరగిద్ద మండలం
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి పండించిన రైతులకు కొనుగోలు చేసిన ధాన్యనికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ క్వింటల్ రూ 500/లు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ ఒక ప్రకటలో కోరారు. సన్న రకాల వడ్లు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇరువైనాల్గు గంటల్లో జమ చేస్తామని చెప్పి రైతు లు వడ్లు అమ్ముకుని నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బోనస్ డబ్బులు రైతుల ఖాతా లలో జామచ్చేయాలని అన్నారు. రైతు రుణ మాఫీ సాంకేతిక కారణాల వల్ల చాల మంది రైతులకు ఇప్పటి వరకు రుణ మాఫీ కాలేదని అన్నారు.వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.