

జనం న్యూస్ ఫిబ్రవరి 22 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రాజమండ్రి బిజెపి జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు చిక్కి నాగేంద్ర సమక్షంలో రాజానగరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి నేతృత్వంలో రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల కో-కన్వీనర్ లు, కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతీ బిజెపి నాయకులకు అండగా ఉంటానని..అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో కలిసి పనిచేసి నియోజకవర్గం అభివృద్ధికి బాటలో పరుగులు పెట్టిద్దామని ఈ సందర్భంగా తెలియజేసారు.
