

జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సు భయలదేరింది. ఈ బస్సును జిల్లా ప్రజా రవాణాధికారి సి హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27 వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు.