Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట మండలం కొత్త రాజాపేట లో జరుగుతున్న మహా కూటములు ప్రార్ధనలో పాల్గొనాలని దైవజనులు బ్రదర్ షాలేమ్ రాజు ప్రత్యేకంగా కోరిన మీదట ఈరోజు రాత్రి జరిగిన కూటమిలో పాల్గొని బ్రదర్ షాలెంరాజు గురించి మాట్లాడుతూ షాలెంరాజు గారు ధన్యజీవి ప్రొద్దున లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా దేవుని సేవలోనే ఉన్నాడు. దేవుడి మాటలే చెప్తున్నాడు. ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలకు ఉపయోగపడే మాట, అది మనల్నందరినీ ఉద్ధరించే మాట అని తెలియజేస్తూ దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళూ ఆయుష్షు ఇవ్వాలని ఇంకా మరింత మందికి ఉపయోగపడేలా ఆయన జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అన్నారు.