Listen to this article

నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతులు పైన శిక్షణ కల్పిస్తున్న కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు.

జనం న్యూస్ ఫిబ్రవరి 23: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు వరి లో డ్రం సీడర్ & వెదజల్లే పద్ధతులతో (నేరుగా విత్తే వరి సాగు) అధిక దిగబడులు పొందవచ్చని కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్తడి నరేష్ తెలిపారు. శనివారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఐ.సి.ఎ.ఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్ ఆధ్వర్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీ.ఎస్.ఆర్ ఫండ్ సహకారంతో నేరుగా విత్తే పద్ధతి వరి సాగు పై చేసే రైతులకు వరి లో డ్రం సీడర్ & వెదజల్లే పద్ధతుల వరిలో డ్రోన్ ద్వారా కలుపు మందు పిచికారిపై శిక్షణ కల్పించారు. అదేవిధంగా చీడ పీడల సమస్య, నీటి యజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులును రైతులకు వివరించారు. నేరుగా వరి విత్తనం ద్వారా కూలీల సమస్యను అధికమించవచ్చును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే . వి.కే- శాస్త్రవేత్తలు డి.నరేష్, & ఎ.కిరణ్, మండల వ్యవసాయ అధికారి బి .రాజు,యంగ్ ప్రోఫెషనల్ జి.సంతోష్, వ్యవసాయ విద్యార్థినిలు రైతులు అరవింద్, సురేందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి , సత్యనారాయణ, దిలీప్ రెడ్డి తదిరులు పాల్గొన్నార