Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని కలిసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐ యన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కాస నర్సింహా యాదవ్ ఇటీవల నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐ యన్ టి యు సి కమిటీ లో కూకట్ పల్లి యోజకవర్గానికి మూసాపేట్ డివిజన్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూకట్ పల్లి నియోజకవర్గం ఐ యన్ టి యు సి అధ్యక్షులు కాస నర్సింహా యాదవ్ ని నూతనంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐ యన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది ఈ సందర్బంగా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. బండి రమేష్ అభినందించి కాంగ్రెస్ పార్టీ నీపై నమ్మకం తో ఈ పదవి ఇచ్చినందుకు కార్మిక విభాగం బలోపేతం చేస్తు పరిశ్రామిక రంగం లో పని చేస్తున్న అర్హులైన కార్మికులకు వారి సామాజిక న్యాయం సమస్యలపై పోరాడాలని అలాగే సంఘటిత అసంఘటిత కార్మికులు మరియు భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం ఉన్న ప్రభుత్వ పథకాలు ఇపించడం లో నీ వంతు కృషి చేయాలని తెలియజేసారు ఈ కార్యక్రమం లో నాయకులు, లక్ష్మయ్య పుష్పరెడ్డి సప్పిడి భాస్కర్ పడాల శివ నారాయణ ప్రకాష్ హుస్సేన్ జమీర్ ఎండీ మోసిన్ మైసయ్య, ఎండీ నయీమ్ ఎజాజ్ మోసిన్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.