

పిబ్రవరి 22: జనంన్యూస్ ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని కొడిశేల గ్రామానికి చెందిన పిడబోయిన లక్ష్మయ్య ఇటీవల మృతి చెందగా వారి కుమారులైన సతీష్, వెంకన్న,వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బడే నాగజ్యోతిస్థానిక నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించి వారికి 50 కేజీల బియ్యాన్ని అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాయం నరసింహారావు యాప నారాయణ ,చేల లక్ష్మి, మంకిడి లక్ష్మి, పిడబోయిన సుగుణ, నాలి కాంతారావు, ఇర్ప.విజయ, నాలి రమేష్, చింత సమ్మక్క, పాయం నర్సింగారావు, ఊరికే రమేష్, చెన్నూరి వెంకన్న, పాయం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.