Listen to this article

వారం రోజుల నుండి వైరల్ ఫీవర్

బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం… బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో గత వారం రోజుల నుండి వైరల్, ఫీవర్ కీళ్ల నొప్పులతో గ్రామ ప్రజలు బాధపడుతుండడంతో డి ఎం హెచ్ ఓ ఆదేశాలనుసారం డాక్టర్ రోహిత్, డాక్టర్ ఉమాకాంత్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడమైనది. వారం రోజుల నుండి వైరల్ ఫీవర్, కీళ్లనొప్పులతో బాధపడుతున్న ప్రజలు గ్రామంలో హెల్త్ క్యాబ్ ఏర్పాటు చేయడంతో గ్రామంలోని ప్రజలను దాదాపు 65 మందికి వైద్య పరీక్షలు చేయగా ఎలాంటి డెంగ్యూ గానీ మలేరియా లేవని కేవలం 16 మంది వరకు కీళ్ల నొప్పులతో, ఐదుగురికి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ గ్రామంలో వైరల్ ఫీవర్,కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ప్రజలు భయపడుతున్నంత వ్యాధులు కావని, కేవలం వాతావరణం మార్పు లేదా గ్రామంలో పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల కావచ్చు అని ఈ వైరల్ ఫీవర్ వస్తున్నాయని తెలిపారు. వైద్యం చేయించుకొని, వారం రోజులు విశ్రాంతి తీసుకున్నచో తగ్గిపోతుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో వైరల్ ఫీవర్ అదుపులోనే ఉందని అవసరమైతే ఈ హెల్త్ క్యాంపు కొనసాగిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రిసిల్లా, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.