

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23. తర్లుపాడు మండలం , లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో హెచ్ఎం షేక్ మౌలాలి ఆధ్వర్యంలో మొదటి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు 1857 మొదటి స్వాతంత్ర పోరాటానికి పదేళ్ల ముందే బ్రిటీషువారి దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని,తెలుగు వారి పోరాట స్ఫూర్తిని బ్రిటీషువారికి చూపించిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రతిఒక్కరూ దేశభక్తిని కలిగివుండాలని, మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు హెచ్ఎం షేక్ మౌలాలి తెలిపారుఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి,చిత్రపటాలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సహా ఉపాధ్యాయులు షేక్ షేక్షావలి పాల్గొన్నారు.