కాట్రేనికోనలో వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ సెప్టెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలో వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న పేద ప్రజల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు మరియు అవసరమైన చికిత్స అందించడం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించిన సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్స్ వారికి అభినందనలు తెలిపారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జనసేన మండల అధ్యక్షులు కూటమి నాయకులు గ్రామ పెద్దలు తదితరులు