విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నా రూతన పిల్లలకు కూడా పాఠశాలలో చేర్పించారుగిన్నియార్పల్లి పాఠశాలలో విద్యార్థులకుదుస్తుల పంపిణీ
గ్రామ అభివృద్ధికి పదంలో నడుస్తానని గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ అన్నారు
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. వీరేశం సెప్టెంబర్ 9 09. 2026 గిన్నియార్పల్లి: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గిన్నియార్పల్లి గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజేస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్, డిప్యూటీ యాసీన్ అలీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ సి.ఏ. వీరస్వామి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను కొనసాగించాలని ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రాజేశ్వరి గోపాల్ విద్యార్థులను అభినందించి, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తామని తెలిపారు.దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.