

జనం న్యూస్ ఫిబ్రవరి 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండం కేంద్రములో ఆదివారం రోజునాబిఆర్ఎస్ పార్టీ ఇసుక పైన చేసిన ఆరోపణల పైన సోమవారం రోజునా స్తూపం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోమా దేవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాప్రసాద్ మాట్లాడుతూ గతములో మీ పాలన పైన జరిగిన ఇసుక దందా వ్యాపారం పైన బహిరంగ చర్చకు మేము సిద్దమే అన్నారు. గత పదేళ్లుగా బిఆర్ఎస్ నాయకులకు దోచుకొని దాచుకోవటం అలవాటు అయి ఇప్పుడు అధికారం పోయి 14 నెలలు అవుతున్న అ తిన్నది మర్చిపోలేక అదే ఆలోచనతో యున్నారు. మీ ప్రభుత్వంలో పది మంది చేతిలోనే ఇసుక వ్యాపారం నిర్వహించారు, ఈ విషయం మీ పార్టీ కార్యకర్తలను అడిగిన చెపుతారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద వాగు ఇసుక ట్రాక్టర్ ట్రిప్ కు 5000 నుండి 6000 రూపాయల వరకు అమ్మినరా లేరా అనే విషయం మీ పాలనలో ఇల్లు కట్టుకునే వారందరికీ తెలుసు అన్నారు.అధికారన్ని అడ్డుపెట్టుకొని ఇసుక డంపులు చేసుకొని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ కు ట్రిప్పర్ కు రూపాయలు 40,000 నుండి రూపాయలు 50000లకు అమ్మినది నిజము కదా!సుంకేట్ పెద్ద వాగు నుండి ఇసుక పాయింట్ పేరు మీద ఒక్క వేబిల్ మీద ఐదు ఆరు ట్రాక్టర్లు నడిపిస్తూ మోర్తాడ్ మండలమే కాకుండా మూడు నాల్గు మండలాలకు పంపలేరా ! ఒకమండల ఇసుక ఇంకొక్క మండలముకు పోవద్దన విషయం అప్పట్లలో మీకు తెలియదా! మీరు మీ పాలనలో చేస్తే సంసారం అదే మేము చట్ట ప్రకారం చేస్తే వ్యభిచారమా !మా ప్రభుత్వం బట్టాపూర్ లో ఇసుక పాయింట్ ప్రారంభమైన రెండు రోజులలోనే వేబిలు యున్న కానీ అర్ధగంట ముందు ఖాళీ ట్రాక్టర్లు ఎట్లా పోయినవి అని ఫోన్లు చేసి కేసులు చేపించి మైనింగ్ అధికారులను తెప్పించి పోలీస్ స్టేషన్లో పెట్టించింది మీరు కాదా,ఎన్ని ఆటంకాలు కల్పించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఇసుక మాఫియా కాకుండా వ్యాపారం చెయ్యకుండా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధముగా గత మీ ప్రభుత్వంలో అమ్మిన దానికంటే సగం ధరకు దొరికే విధముగా కృషి చెయ్యడం జరుగుతుంది. మీ లాగా డంపు చెయ్యడం జరగదు, బాల్కొండ నియోజకవర్గం దాటి పోవటం జరగదు. పని ఎక్కడ యుందో అక్కడనే పొయ్యటం జరగుతది. మీ లాగా పది మంది నాయకుల కనుసైగలలో నడవకుండా కొంత మందికే లాభం చేకూర్చే విధముగా కాకుండా ఏ గ్రామములో వారే వారి అవసరం బట్టి ట్రాక్టర్లతోనే వేబిలతోని నియానిబంధాల ప్రకారమే ఇసుక తీసుకువెళ్లటం జరగుతది అందరూ ఓపికతో సహకరించాలి. ఇప్పుడు ఇసుక పోసుకుంటున్న ఇంటి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళితే ఒక్కసారి అడిగితే వారి అభిప్రాయం మీకు తెలుసుకుని మాట్లాడాలని కోరినారు. మీలాగా మావారికి ఇసుక దందా చెయ్యడం అలవాటు లేదు.ఇట్టి కార్యక్రమములో ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, ఓర్స్ రాములు, రెండ్ల రాజారెడ్డి, మేకల సాయన్న,కార్యకర్తలు పాల్గొన్నారు.