Listen to this article

జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా కంఠేశ్వర్ లోని మార్కండేయ పద్మశాలి సంఘం భావనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ.పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గత ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే కాంగ్రెస్ పాలనలో కూడా తెలంగాణ ప్రజలకు అదే అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు వారి సమస్యలకు భరోసా లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన కెసిఆర్ కి ఏ గతి పట్టిందో రేవంత్ కు అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 4వేలు, విద్య భరోసా గ్యారంటీ, ఆడబిడ్డలకు ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ 6 వేల కోట్ల పైగా ఉన్న బకాయిలు విడుదల చేసేవరకు బిజెపి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాదు అని హెచ్చరించారు.నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు అలోచించి ఓటేయ్యాలన్నారు మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మి మోసపోయి గోస పడొద్దు అని విజ్ఞప్తి చేసారు.నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మేడలు వంచి అమలుచేపించాలంటే మండలిలో ప్రశ్నించే గొంతుకలైన బిజెపి అభ్యర్థులు మల్కా కొమురయ్య కి,అంజిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు ఆనంద్ రావు , బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.