

గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజి అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని గిరిజన బాలుర పాఠశాలలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు కాంట్రాక్ట్ అండ్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్లకు జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్కులర్ (గెజిట్) ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేస్తున్నదని అన్నారు. జీవో నెంబర్ 64 తో భారీగా తగ్గిపోతున్న వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 64 ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం గిరిజన కార్మికులకు ద్రోహం చేయటమే అవుతుందని అన్నారు. పర్మినెంట్ చేస్తాము అని హావిుఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు పెంచడం మాటను పక్కనపెట్టి వస్తున్న జీతాన్ని సగానికి పైగా తగ్గించడం చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని గిరిజన హాస్టల్ వర్కర్లు అందరూ ఐక్యంగా ఎదిరించి పోరాడాలనీ. జిల్లా కలెక్టర్ సర్కులర్ ప్రకారమే జీతాలు అమలు చేయాలని సిఐటియు ఇచ్చే పోరాటపు పిలుపుల్లో వర్కర్లు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు చనిపోయిన కుటుంబ వారసులకు ప్లైస్మెంట్ చూపించుట విషయంలో జరుగుతున్న జాప్యానికి సిద్ధం కావాలని కొత్తగా తీసుకున్న,ప్రస్తుతం పనిచేస్తున్న వర్కర్లకు సంవత్సర కాలం నుండి వేతనం చెల్లించుటకు ఆన్లైన్ చేయకుండా వేతనం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గళం విప్పాలని వేసవి సెలవులలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు*.పెండింగ్ లో ఉన్న వేతనాలు ఎరియర్స్ తో సహా వెంటనే చెల్లింపులు చెయ్యాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వర్కర్లు సంతోష్, సుల్తానా, కన్నుబాయి అన్నుబాయి,తుకారాం, మహేష్, లు పాల్గొన్నారు