

బనగానపల్లె, జనం న్యూస్ ఫిబ్రవరి 25 :బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గంగారపు మధురోహిత్ అనే విద్యార్థి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ ఎంఎంఎస్) కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణయ్య తెలిపారు. గత డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జరిగిన ఎంపిక పరీక్షలో తమ పాఠశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం రూ.12 వేలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థి మధురోహిత్ ను ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.