Listen to this article

** భక్తులతో కిటకిట లాడిన పుణ్య క్షేత్రాలు..

జనం న్యూస్ 27 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని పుణ్యక్షేత్రాలైనటువంటి ఓంకారం,శివ నంది,విష్ణు నంది,గుండ్లబ్రహ్మేశ్వరం ఆలయాలకు జనం తండోపతండాలుగా శివనామ స్మరణంతో నల్లమల మార్మోగుతుంది. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తుంది. హర హర శంభో శంకర, ఓం నమః శివాయ అంటూ నినదిస్తూ సన్నిధికి భక్తులు చేరుకుంటున్నారు. భక్తులతో ఆలయాలు కిటకిట లాడుతున్నాయి .ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సదుపాయాలు కల్పించారు.