Listen to this article

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. మహాశివరాత్రి సందర్భంగా హర హర మహాదేవ శంభో శివ శంకర
సాంబ సదాశివ నమో నమో అంటూ భక్తులు బుధవారం ప్రొద్దున నుండి శివనామస్మరంతో జిల్లాలోని గుడు లన్ని భక్తులతో కిటకిటలాడినవి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శివాలయాలు అన్ని శివ శివ అంటూ మారుమోగినవి. బుధవారం నుండి మొదలైన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి జరుపుకుంటున్నారు. నేడు గురువారం రోజున అన్న సత్రాలు ఏర్పాటు చేయబడిన సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు ముగించుకుంటున్నారు. వేకువ జామున నుండి శివాలయాలకు చేరుకున్న భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఇందూరు నగరంలోని కంటేశ్వరాలయం. శంభు లింగేశ్వర ఆలయం. మనోకామేశ్వరాలయం. బిక్కునూరు సిద్ధ రామేశ్వరాలయం. బోధన్ చక్రేశ్వరాలయం. ఆర్మూర్ సిద్దుల గుట్ట ఆలయం. సిరికొండ శ్రీ లోంక రామలింగేశ్వర ఆలయం. మద్దికుంట రామలింగేశ్వర ఆలయం. భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకొని ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉమ్మడి జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా తమదైన పద్ధతిల్లో లో విధులు నిర్వహించారు. నేటితో శివరాత్రి ఉపవాస దీక్ష ముగీయా నున్నది.