

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రూ.3లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన చిలకలూరిపేట:పట్టణంలోని నెహ్రు నగర్ లో మత్తుకు బానిసైన యువకుడు ఇంట్లో ఉన్నటువంటి సామాలను తగలబెట్టారు. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే కాకాని రోశయ్య కుమారుడు ప్రకాష్(19) గంజాయి డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినటువంటి సంఘటనలు కో కో కొల్లాలుగా ఉన్నాయి. సెల్ ఫోన్ చోరీలో పోలీసులకు పట్టు పడడంతో మొదటి తప్పుగా మందలించి వదిలిపెట్టారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి కోటప్పకొండ తిరుణాలకు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరు లేకపోవడం వలన
డ్రగ్స్కో బానిస అయిన యువకుడు ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు మంచాలు,ఇతర సామాన్లు తగబెట్టారు. ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మంటలను ఆర్పి వేశారు. సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం జరిగి ఉండిద్దని చుట్టుపక్కల ప్రజలు అంటూన్నారు. అర్బన్ పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. ఇంటిని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు. కుమారుని కోసం తండ్రి ఆరాటం: మత్తుకు బానిసకు గురైన తన కుమారుని ప్రకాష్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, పలు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.తన కుమారుని కోసం ఆయన చేసిన ఆరాటం ఆడిఆశాలుగానే మిగిలిపోయాయి. పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మత్తు పదార్థాలకు లోను కాకుండా తన కుమారునికి తగిన చికిత్స అందించాలని వేడుకుంటున్నారు.