

ఘనంగా నిర్వహించిన గ్రామస్తుల ఫిబ్రవరి 27 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు వాజేడు మండల పరిధిలోని పాత అయ్యవారిపేట గ్రామంలో శివాలయ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయలల్లో భక్తులతో కిటకిట లాడాయి మహాశివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా ప్రారంభించారు. జాతర ఉత్సవాలకు వాజేడు మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం పేరూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా వచ్చి శివాలయంలోస్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వయించారు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్నిమహోత్సవాన్ని భక్తులు కనులరా తిలకించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకొని తీర్ధప్రసాదలు స్పీకరించారు
