

జనం న్యూస్ జనవరి 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం లోని లంబాడిగూడ చౌరస్తాలో బైక్ లు ఎదుదురు డీ కోన్నగా ఘోర ప్రమాద జరిగింది.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రాజు అను వ్యక్తి పొలం పనుల కొరకు సులుగు పల్లి వెళ్లుచుండగా, బెజ్జుర్ నుండి ఇసగం 8నంబర్ కు చెందిన వారుగా గుర్తించి ఇతను హాస్టల్ లో చదువుతున్న విద్యార్థిని తీసుకో వస్తుండగా లంబాడిగూడ వారసంత చౌరస్తా వద్ద బైక్ బైక్ డీ కొనగా ప్రాణా అపాయం స్థితిలో ఉన్నందున స్థానికులు ఆటోలలో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.వెంటనే స్థానికులు స్పందించి మీడియా సమావేశం లో మాట్లాడుతూ లంబాడి గూడా చౌరస్తాలో గత సంవత్సరాలనుండి బ్రేకర్లు వేయాలని, ఆక్సిడెంట్లు జరుగుతున్నావని, అధికారులకు, రోడ్డు కాంట్రాక్టర్ కు, సంబంధిత అధికారులకు, మండలాధికారులకు చే ప్పిన పట్టించుకోవడం లేదని, తరుచుగా రోడ్డు ఆక్సిడెంట్లు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రధానరహదారి లంబాడిగూడ ప్రమాదాలు జరుగకుండా బ్రేకర్లు ఏర్పాటుచేయాలనీ గ్రామస్తులు వేడుకొంటున్నారు.