

జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఉదయం నుండి శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం సాయంత్రం వేళలో బండ్లు ఊరేగింపు కొనసాగింది మరియు రాతి సమయంలో మల్లన్న జీవిత చరిత్ర సాంస్కృతిక నాటక కార్యక్రమం ఉంటుంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులు గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు శుక్రవారం రాత్రి సమయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా రెండవ రోజు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు