

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ లో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి.పురోగమనo వైద్య విద్య విధానం లో అనేక ఆవిష్కరణలు వల్ల మానవ జీవన ప్రమాణాలు పెంపు సాధ్యమైందని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ సక్సెస్ చేయడం సాంకేతిక పురోభివృద్ధికి సాధ్యమైంది.మొక్కలు జీవన విధానం. వివిధ వంగడాల తయారీ. హైబ్రిడ్ విధానం లో అనేక ఆవిష్కరణలు వల్ల తక్కువ స్థలం తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు తయారీ సాధ్యమైందన్నారు.విద్యార్థి దశలోనే శాస్త్రీయం గా పరిశీలించి పరిశోధించి తెలుసుకోమని తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మరాదని వాటిని పారద్రోలే శక్తి అలవర్చుకోవాలని అన్నారు.3,4,5 తరగతుల విద్యార్థులు వారు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన చేసి వివరించారు. సర్ సి వీ రామన్ ఎఫెక్ట్ కనుగొని ఈ దృగ్విషయం ప్రపంచానికి అందజేసిన రోజు కావున ఈ రోజు సి వి రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు . నివాళులు అర్పించారు వారి జీవిత విశేషాలను వివరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కే సుధ ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు.ఏ నీలిమ. యన్. ఆంజమ్మ పాల్గొని సైన్స్ ప్రాముఖ్యతని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ని వివరించారు.