

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల”లో భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగారి బిక్షపతి మాట్లాడుతూ మనము నిద్రలేచింది మొదలు పడుకునే వరకు చిన్నచిన్న మిషన్ల నుండి స్పేస్ రీసర్చ్ వరకు ఎన్నో అంతుచిక్కని రహస్యాలను ఛేదించేది సైన్స్ అని ఈరోజు మన భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి చంద్రశేఖర వెంకట రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భంగా, ఈ “నేషనల్ సైన్స్ డే “ని జరుపుకుంటున్నాము,ఈయన పరిశోధనకు గాను మన భారతదేశంలో సైన్స్ విభాగంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ను పొందినటువంటి వ్యక్తిగా రామన్ పేర్కొంటారు. ఈయన సేవలకు భారత ప్రభుత్వం “భారతరత్న” అవార్డుతో సత్కరించిందని, ఆయన పరిశోధనకు అయినటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ అని మరియు విద్యార్థులు శాస్త్రవేత్తల కృషిని గుర్తిస్తూనే నుండి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోస్టర్ ప్రెజెంటేషన్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా కె.రాజ్యలక్ష్మి వ్యవహరించగా, కుమారస్వామి బాలరాజు, చంద్రమౌళి, ఇందిరానైనా దేవి, సబీ ఫాతిమా, సుధా మాధురి ,విజయ ,అనిత ,పరుశురాం, శ్రీనివాస్ ,రమేష్ ,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.