

జనం న్యూస్ మార్చి 1 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి : 41 సంవత్సరాల రెండు నెలల సర్వీస్ పూర్తి చేసుకుని 61 సంవత్సరాల వయస్సు పూర్తితో పదవి విరమణ పొందుతున్న కల్వచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం) ఉపాధ్యాయులు జక్కు సత్యనారాయణమూర్తి ని పాఠశాల ఆవరణలో పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ శోభన్ రావు, సహా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో పాటు, పుర ప్రముఖులు తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి చిలగాని శ్రీధర్ చేనేత కండువా కప్పి మార్కండేయ దైవం ఫోటోను జ్ఞాపికగా అందించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటూ వారు చేసిన సేవలను కొనియాడారు.