Listen to this article

పంపిణీ చేసిన చిలువేరు స్వామి

జనం న్యూస్ మార్చి 1 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) పెద్దపల్లి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి తమ సొంత ఖర్చులతో పరీక్ష ప్యాడ్లు పెన్నులు విద్యార్థులకు విద్య కమిటీ చైర్మన్ సబ్బు రాజకుమారి సతీష్, తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, చదువుతోటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థికి చదువు ప్రధాన ఆయుధమని, భవిష్యత్తుకు పునాది ఇక్కడ నుండే వేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించి విద్య నేర్పిన గురువులకు, పాఠశాలకు మంచిపేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల నరసయ్య, బాలవేన రాజేశం పాల్గొన్నారు.