తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థిని ఎంపిక

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు సోమవారం 20/09/2026న జరిగిన డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ మీట్‌లో ట్రయాథ్లాన్ విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించి, ఈ నెల 26, 27 తేదీలలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థిని అపర్ణ ఎంపికైనది. పెబ్బైర్ మండలంలో నిర్వహించిన SGF (School Games Federation) మండల స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి, మండల స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయికి ,అండర్-14 విభాగంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలకు వైష్ణవి, కేశవ్, అభిషేక్ ఎంపికయ్యారు. వీరు ముగ్గురూ SGF డిస్ట్రిక్ట్ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఇట్టి విద్యార్థులు అందరినీ పాఠశాల డైరెక్టర్ ఈ రంగారెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు

ఇ-పేపర్