Listen to this article

మతసామరస్యాన్ని చాటుకుంటున్న ముస్లిం సోదరులు..

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న నానుడిని నిజం చేస్తూ ముస్లిం సోదరులు   మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు . నంది కొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానికంగా నివాసం ఉంటున్న జబ్బర్  వారి కుటుంబ సభ్యులు శుక్రవారం స్థానిక ఏరియా కమలా నెహ్రు ఆసుపత్రి ప్రక్కన జమ్-జమ్  చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు మండిపోతూ ఉండటంతో
ఎండల్లో తిరిగి దాహంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, ఆసుపత్రికి  వచ్చే రోగుల  ఈ చలివేంద్రం దాహార్తిని తీరుస్తుంది, జమ్- జమ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నవీరికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు గతంలో  రంజాన్ మాసం సందర్భంగా ప్రతిరోజు మజ్జిగను అందివ్వటం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 10సంవత్సరాలుగా నిత్యం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని, నందికొండ ప్రజలకే కాకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు మజ్జిగ,మంచి నీటిని అందిస్తున్నామని అన్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చలివేంద్రాలుఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.