

రథోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ మార్చి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీ మలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు కోలాటాలతో ఆటపాటలతో అందరినీ అలరించారు మరియు జడ కొప్పు వేశారు జడ కొప్పు అందరికీ కనుల విందుగా కనిపించింది ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి తదనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు శనివారం లంక దహన కార్యక్రమం ఉంటుందని గ్రామ ప్రజలు తెలియజేశారు కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నారు