Listen to this article

జనం న్యూస్ మార్చి 1. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు సైన్స్ గురించి చక్కగా వివరించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకారపు రాజు మాట్లాడుతూ, బల్బు, స్పేస్, రిషర్స్,మిషన్ల, నుంచి ఎన్నో అంతుచిక్కని, రహస్యాలను అర్థం చెప్పేదే సైన్స్ అని, దేశ అభివృద్ధికి సైన్సు మూలమని అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు పరిగి డిఎస్పి శ్రీనివాస్ సార్,ఎస్ఐ సంతోష్ కుమార్ సార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ హాజరైనారు. వారికి స్కూల్ డైరెక్టర్ ఆకారం రాజు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అబ్దుల్ రాహుల్, వైస్ ప్రిన్సిపాల్ ఆకారపు గౌతమి, మరియు స్కూల్ టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.