

జనం న్యూస్,మార్చి 01,అచ్యుతాపురం; జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మార్చి 12, 13,14 మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి14న పిఠాపురంలో జరగబోయే ప్లీనరీ ఏర్పాట్ల కోసం ఈరోజు కాకినాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మరియు జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,తదితరులు పాల్గొన్నారు.