

10 వ తర్గతి విద్యార్థులకు వీడ్కోలు పలికిన 9వ తర్గతి విద్యార్థులు. జనం న్యూస్,మార్చ్ 01, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చదువుల తల్లి సరస్వతీ మాత ప్రతిమను ప్రత్యేకంగా పూజించి దీపారాధనతో పదవ తర్గతి విద్యార్థులకు తొమ్మిదవ తర్గతి విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు జీవితంలో తొలి మెట్టు అని క్రమశిక్షణతో విద్యా విలువలను, మెలకువలను ఉపాధ్యాయుల నుంచి నేర్చుకోవాలని పది పాయింట్లతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని,లక్ష సాధనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.అలాగే తల్లిదండ్రుల ఆశాజ్యోతి విద్యార్థులేనని అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్య నాట్య సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.