

సోదరభావం తో పండుగ జరుపుకొనుటకు అందరు సహకరించాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
జనం న్యూస్ మార్చి 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
-సబ్జెక్ట్- పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లాలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లు పై అధికారులతో, ముస్లిం మత పెద్దలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం మతపెద్దలకి, ప్రజలకి ముందుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతూ మార్చి 2 నుండి మొదలయ్యే రంజాన్ మాసం సందర్బంగా ప్రతి గ్రామం లో, మున్సిపల్ వార్డు లలో మసీదు,ఈద్గాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, మురికి కాల్వలో ఉన్న చెత్త తొలగించి దోమలు లేకుండా స్ప్రే చేయాలని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వీధి దీపాలు వెలిగేలా చూడాలని, అధికారులకి సూచించారు.ముస్లిం ఉద్యోగులు రంజాన్ మాసం లో ఉపవాసం చేయుటకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మినహాయింపు ఇవ్వాలని అధికారులకి సూచించారు.పండుగ రోజు పాలు ఎక్కువ సరఫరా చేయాలని,షాప్స్, హోటల్స్ ఎక్కువ సేపు ఓపెన్ చేసేందుకు మున్సిపల్, లేబర్, పోలీస్ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.వార్డు లలో, గ్రామాలలో త్రాగునీరు ఎక్కువ సరఫరా చేయాలని అవసరం ఉన్న చోట ట్యాంకర్ల సహాయం ద్వారా నీరు సరఫరా చేయాలని తెలిపారు.విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేయాలని, ఆప్రోచ్ రోడ్లకి గుంటలు ఉంటే పుడ్చాలని సూచించారు. ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలుకాపాడుకొనుటకు , ట్రాఫిక్ నియంత్రణ కొరకు పోలీస్ శాఖ అధికారులు పకడ్బoది బందోబస్త్ ఏర్పాటు చేయాలని సూచించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదవారికి ధానధర్మాలు,సేవ చేయాలని గంగ జమునా తెహజీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి పవిత్రమైన రంజాన్ మాసం సోదరభావంతో జరుపుకునేలా మత పెద్దలు, శాంతి (పీస్ )కమిటీ సభ్యులు సహకరించాలని కోరినారు. తదుపరి ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కబరస్తాన్ లో పిచ్చి చెట్లు తీపించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమావేశం లో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్ రెడ్డి, డి యం హెచ్ ఓ కోటాచలం, ఆర్డీఓ లు వేణుమాధవ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు,డిఎస్పీ రవి, మున్సిపల్ కమిషనర్లు, మత పెద్దలు, ఇమామ్ లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
