Listen to this article

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ ,
జనం న్యూస్ మార్చి ఒకటి కాట్రేనికోన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ లోని అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె. ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళల భద్రత మరియు మహిళలు సాధికారత గురించి ప్రస్తుత కాలంలో మహిళల మీద జరిగే సైబర్ నరాల గురించి వాటి నుండి ఏ విధంగా జాగ్రత్త పడాలో పలు సూచనలు మరియు వాటిని అధికమించే భాగంలో డైల్ 112, డైల్ 1930 మరియు ఉమెన్ హెల్ప్ డెస్క్ వంటి వంటి సేవల ద్వారా పోలీసులు మహిళలకు కల్పిస్తున్న భద్రత గురించిన విషయాలపై మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అమలాపురం రూరల్ సిఐ డి. ప్రశాంత్ కుమార్ మరియు అమలాపురం తాలూకా ఎస్సై వై. శేఖర్ బాబు ఉప్పలగుప్తం ఎస్సై సిహెచ్. రాజేష్ పాల్గొనడం జరిగింది.