

రామకోటి రామరాజు నిర్వీరామ కృష, పట్టుదల అమోగం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి లక్షల మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొననున్నారు జనం న్యూస్, మార్చ్ 02( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి నాడు ద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. ఈ గోటి తలంబ్రాల అవకాశం తెలంగాణ నుండి గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజానికి దక్కింది. కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం శనివారం నాడు కృష్ణాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజరై ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మన గజ్వేల్ ప్రాంతం నుండి ముచ్చటగా మూడోసారి గోటి తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. భద్రాచల దేవస్థానం వారు రామకోటి రామరాజు సేవను గుర్తించి ఇలాంటి అద్భుత కార్యక్రమం అప్పజెప్పడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు. గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే ఒడ్లను ఓలిపించి భద్రాచల పంపించడం మళ్ళీ వారికి కళ్యాణం అనంతరం కళ్యాణ తలంబ్రాలు అందించడం అన్నది శ్రమతో కూడుకున్న పని. కానీ రామకోటి రామరాజు రామభక్తితో చేస్తున్నాడన్నాడు. అయన చేస్తున్న సేవలు అపారమైనవని ఘనంగా సన్మానించి మరో భక్త రామదాసును చూస్తున్నాడన్నాడు. భక్తులందరికి ప్రతాపరెడ్డి చేతుల మీదుగా గోటి తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గత సంవత్సరం ఒకసారి 20కిలోలు, మరోసారి 150కిలోలు ఇవ్వగా ఈసారి 250కిలోల ఇవ్వడం వాటిని గోటితో ఓలిపించి భక్తితో భద్రాచలం పంపడం అన్నది రామకోటి రామరాజు కృషి పట్టుదలే కారణం అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లడం అయన రామభక్తి అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో జశ్వంత్ రెడ్డి, యెల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్, యెలగందుల రాంచంద్రం ఉప్పల వెంకటేశం, దూబకుంట మెట్రాములు, అత్తెల్లి శ్రీనివాస్, బింగి స్వామి, ఉప్పల మధు, బండారు మహేష్, మెతుకు నర్సింలు, పాలకొల్లు వెంకట్రాంరెడ్డి, బల్లి నాగరాజు, అయిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

