Listen to this article

డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మార్చి 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు నుండి మోతే వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా విజయరామపురం, రేపాల,నరసింహాలగూడెం గ్రామాల గుండా అతి భారీ వాహనాలు వేగంతో నడుస్తున్నాయని వాటిని నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అతి భారీ వాహనాలు గ్రామాల్లో వేగంగా నడుపుతున్నారని దీని మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు స్పందించి వాహనాల వేగాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే రోడ్డు నిర్మాణ పనులు భాగంగా ఆయా గ్రామాల్లో రోడ్డుపై దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టించాలని సంబంధిత శాఖ అధికారులను ఒక ప్రకటనలో కోరారు.