Listen to this article

జనంన్యూస్.01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో పీఎం శ్రీ స్కూల్ స్కీమ్ లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి మరియు నైపుణ్యల పెంపుదల కొరకు సుమారు 5లక్షల రూపాయలు విలువ చేసే 25 సాంసంగ్ గెలాక్సీ ఏ 7 లైట్ ట్యాబ్ లను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నుండి మన పాఠశాలకు పంపిణీ చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ ట్యాబ్లు ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐ సి టీ.వివిధ రకాల సమాచారాలను నిర్వహించడానికి మరియు ప్రసారం చేయడానికి ఉపయోగించే విస్తృత సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల బోధన మరియు అభ్యసన ప్రక్రియలను సులభతరం చేస్తాయని అలాగే ఇ-లెర్నింగ్ ఫ్లాట్ ఫారమ్ లు,వర్చవల్ క్లాస్ రూమ్ లు మరియు ఆన్లైన్ కోర్స్ లు మరియు పరీక్షలు నిర్వహించడానికి,పాఠశాలలో ఉన్న (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్)-టీవీ లు అనుసంధానం చేయడానికి ఈ ట్యాబ్లు ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి తెలియజేయడం జరిగింది.