

జనం న్యూస్ 2025 జనవరి 11 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ , సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు,వడ్డెర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు ‘‘1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారని. కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని వడ్డే ఓబన్న. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను .’’అందరు స్మరించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు