జనం న్యూస్ 25 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఎ టువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న పశువుల అక్రమ రవాణాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 4 బొలెరో వాహనాలలో తరలిస్తున్న 22 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. ఎలాంటి రశీదులు రవాణా అనుమతి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు అధికారులకు ముందస్తు సమాచారం అందింది. వంగూరు మండలం నుండి కల్వకుర్తి జడ్చర్ల మీదుగా షాద్ నగర్ సర్దార్ నగర్ కు తరలిస్తున్నారు. దీంతో మిడ్జిల్ ప్రధాన రహదారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. మండల కేంద్రంలో వేగంగా వస్తున్న నాలుగు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో పశువులను అత్యంత క్రూరంగా ఇరుకైన స్థలంలో కట్టిపడేసి తరలిస్తున్నట్లు గుర్తించారు నిబంధనల ప్రకారం పశువులను రవాణా చేస్తున్న 4 బొలెరో వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. రక్షించిన మూగజీవాలను తగిన సంరక్షణ కోసం సమీపంలోని సురక్షిత గోశాలకు తరలించినట్లు స్థానిక ఎస్సె శ్రీనివాస్ తెలిపారు. అనుమతి లేకుండా పశువులను కబేళాలకు లేదా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.