Listen to this article

జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్‌ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.