Listen to this article

ఒత్తిడిని జయిస్తే, విజయం మీదే.

ఆందోళనను వీడి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే మంచి మార్కులు.

ఆందోళనే అసలు పరీక్ష.

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్.

జనం న్యూస్,మార్చ్ 02,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్,అన్నారు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు,అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికి అయిదు మెట్లు,అయిదు ఆడుగులు దాటితే విజయం ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది అన్నారు. పట్టుదల లక్ష్యం అవసరం ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొవాలి, అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన,తనదై ఉండాలి.చదివింది చదవాల్సింది,మాత్రమే గుర్తుకు రావాలి.అర్థం కాని అంశాలను గురువులతో,తన తోటి మిత్రులతో అడిగి తెలుసుకొని అర్థమయ్యేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా,తన ముందున్న లక్ష్యంతో ముందుకు సాగాలి.ఆలోచనలు నియంత్రణలో ఉంచాలి.విద్యార్థులు గతంలోని సంఘటనలను, బాధలను ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. తాను అభ్యాసన అభ్యాసాలు నిలకడగా ఉండకపోగా, భవిష్యత్ ను గుర్తు చేసుకుంటే రేపు ఏమౌతదో అనే ఆలోచన ఆందోళనలను పెంచుతుంది.ఇలా గతం ఒత్తిడిని, భవిష్యత్ ఆందోళనలను నిగుల్చుతుంది.పైగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, కళాశాలలో జరిగిన సంఘటనలు,స్నేహం, ప్రేమ లాంటి అంశాలు అవరోధాలుగా మారి పరీక్షల సన్నద్ధతకు అడ్డుపడతాయి అని అన్నారు.తమకు తాము నియంత్రించుకుని ప్రతి విద్యార్థి తమ ఆలోచనలను వర్తమానంలో ఉంచడానికి ప్రయత్నం చెయ్యాలని అన్నారు.సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఈ సమయం విద్యార్థులకి అత్యంత విలువైన సమయం.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠ్యంశాలను ప్రణాళిక బద్ధంగా తయారు చేసి చదువే లక్ష్యంగా పూర్తి సమయాన్ని కేటాయించుకోవాలని అన్నారు.రాత్రి త్వరగా నిద్రపోయి బ్రహ్మ ముహూర్తంలో 04 గంటలకి సూర్యోదయానికి ముందు లేచి చదవడం ఉత్తమం అని అన్నారు.అభ్యసనా, ఆత్మవిశ్వాసం ముఖ్య ఆయుధం!విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే, అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పాస్ మార్కుల కోసం అర్ధం కాని కొత్త అంశాల జోలికి వెళ్లకూడదని అన్నారు. ఇదివరకు అభ్యసించిన ముఖ్యమైన అభ్యాసనలను చదివిన అంశాలు విషయాలనే పరీక్షల వరకు నిరంతర అభ్యసన కొనసాగించాలని అన్నారు.సెల్‌ఫోన్‌ తో దూరం.!నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం ఆన్ రైడ్ మొబైల్ ఫోన్, ముఖ్యంగా విద్యార్థులకు సెల్‌ఫోన్ లేనిదే దినం గడవడం లేదు.ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా,చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుందని అన్నారు. మెదడుపై,కంటి చూపు పై,ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.ప్రస్తుతం పరీక్షల వరకు ఆన్ రైడ్ ఫోన్,పక్కన పెట్టకపోతే సంవత్సరం మొత్తం కష్టపడ్డది వృధా అవుతుందని అన్నారు.