


సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్
జనం న్యూస్ // మార్చ్ // 3 // కుమార్ యాదవ్.. ఆదివారం రోజున పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గ్రామపంచాయతీలో జమ్మికుంట మండల కమిటీ సమావేశం ఎన్ట్డగా రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. మార్చి 4వ తేదీన జిల్లా డిపిఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే మార్చి 6)ఆరో తేదీన నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జమ్మికుంట మండల కమిటీ సమావేశంలో, ఈ కార్యక్రమాల జయప్రదానికి కార్మికులందరికీ కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినప్పటికీ పంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, చాలీచాలని వేతనాలతో 9500 /-రూ!!లకి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని, ఇచ్చే అరా కోర జీతం కూడా నెలల తరబడి బకాయి పెడితే అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ గ్రామపంచాయతీలలో పని చేయాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇప్పటికైనా పంచాయతీ కార్మికులకు, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000/- నిర్ణయించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటగిర్ల వారిగిన పనులు చేపించాలని, ప్రమాదవ శాస్తూ డ్యూటీలో మరణించిన కార్మికుల కుటుంబానికి 15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం అందించాలని, పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయం అందించాలని తదితర డిమాండ్ల పరిష్కారం, కోసం అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్న ప్రభుత్వాలు మారుతున్నాయి, తప్పితే పంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దశల వారి ఆందోళన పోరాటాలకు దిగుతున్నామని ఈ కార్యక్రమంలో , యూనియన్ మండల, ఉపాధ్యక్షులు, గరిగంటి రవి కోశాధికారి, మేక మల్ల రాము, కంటి సభ్యులు, దొడ్డె శ్రీనివాస్, లద్దు నూరి సంపత్, అలీమా పరశురాములు మొగిలి, ఉమా, మానస, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.